Home  »  TV News  »  Ye Devi varamo Neevu : రక్షకుడే భక్షకుడయ్యాడు.. అంజలికి ఎదురైన ఊహించని సవాల్!  

Updated : Jul 10, 2026



స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -04 లో..... ఆశ్రమానికి రాత్రి దొంగలా వచ్చి హీరోలా రౌడీలని కొట్టిన అతను ఒక జీపు తీసుకొని వస్తాడు. ఇది మీ కోసమే తీసుకొని వచ్చాము.. ఇప్పుడు మనం అందరం ఒక మంచి లొకేషన్ కి వెళదామని పిల్లలందరిని పిలుస్తాడు‌‌.. మేం మా అంజలి అక్కతో చెప్పకుండా ఎక్కడికి రాము అని వాళ్ళు అంటారు. వాళ్ళకి అతను చాక్లెట్స్ ఆశ చూపిస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే జీపు ఎక్కుతారు. అప్పుడే అంజలి వచ్చి ఎందుకు వాళ్ళని ఎక్కించుకున్నావ్.. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. కొంచెం దూరం వెళ్తే మంచి లొకేషన్స్ ఉన్నాయని అతను చెప్తాడు. నేను చూడని లొకేషన్స్ లేవని అంజలి అంటుంది. మీరు కుడా రావచ్చని అతను అనగానే.. వస్తాను.. పిల్లల కోసమే వస్తానంటూ అంజలి కూడా జీపు ఎక్కుతుంది.

మరొకవైపు పిల్లలు లొకేషన్ ని చూసి చాలా బాగుందని అంటారు. ఇక మీరు రేపటి నుంచి ఇక్కడే ఉండాలి.. ఇక్కడ అన్ని సౌకర్యలు ఉంటాయని అతను చెప్పగానే ఎందుకు అలా అంటున్నావని అంజలి అంటుంది. ఎందుకు అంటే అక్కడ ఉంటే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా అని అతను అనగానే అంటే పిల్లలని ఇక్కడే ఉంచెయ్యాలని అంటున్నారు. అదంతా ఏం కుదరదు ఆశ్రమంలో ఉంటారు.. ఎవరు వచ్చినా నేను చూసుకుంటానని అంజలి కోపంగా అక్కడ నుంచి పిల్లలని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత గీతాంజలి తన మేనేజర్ తో వెళ్తుంటే అక్కడ దారిలో చెట్టు విరిగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంజలి పిల్లల్తో ఆటోలో వస్తుంది. ఎవరు ఆ చెట్టుని పక్కకి తియ్యకపోవడంతో తనే ముందుకు వచ్చి అందరిని పిలిచి చెట్టు పక్కకు వేస్తుంది. అదంతా గీతాంజలి చూసి ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత గీతాంజలి తన గతాన్ని గుర్తుచేసుకొని బాధపడుతుంది. మరొకవైపు ఆశ్రమం ఖాళీ చెయ్యాలని కొంతమంది రౌడీలు వచ్చి సామాను బయటపడేస్తారు. ఇక అప్పుడే అంజలి వాళ్ళు ఆటో దిగుతుంటే ఒకతను వచ్చి.. మీ ఆశ్రమంలోని వాళ్లని కొడుతున్నారని.. మీ సామాన్లని కూడా బయటపడేస్తున్నారని అతను అనగానే  అంజలి పిల్లలు త్వరగా అక్కడికి వెళ్తారు.

ఎందుకు ఇలా చేస్తున్నారని రౌడీలపై అంజలి కోప్పడుతుంది. మీరు ఇలా చెప్తే వినట్లేదు మా సర్ వస్తున్నారని ఆ రౌడీ అనగానే అందరు అటువైపు చూస్తారు. తీరాచూస్తే ఆశ్రమంలోకి దొంగలాగా వచ్చి రౌడీలని కొట్టిన అతనే వాళ్ళ సర్.. ఇక అతను రాగానే నువ్వా అని అందరు షాక్ అవుతారు. ఇంత మోసం చేస్తావా ఒక రోజు ఉండడానికి చోటు ఇవ్వమని వచ్చి ఇంత మోసం చేస్తావా అని జానకమ్మ అంటుంది. మరేం చెయ్యాలి.. మీరు చెప్తే వినట్లేదు కదా అని నేనే వచ్చాను అని అతను అంటాడు. మీరందరు ఆ గీతాంజలి మనుషులు కదా అని అంజలి అనగానే గీతాంజలి కాదు గీతాంజలి గారు అను అని అతను కోప్పడతాడు. నేను గీతాంజలి గారికి మేనల్లుడిని అని అతను చెప్తాడు. తరువాయి భాగంలో గీతాంజలి భూమి పూజ చేస్తుంటే అంజలి వచ్చి అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.